Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 13-07-2026

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:21 AM

దక్షిణ భారత యువ రచయితల ఉత్సవం, కథా సంపుటాలకు ఆహ్వానం, కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు , సినారె ‘విశ్వంభర’ పురస్కారం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 13-07-2026

దక్షిణ భారత యువ రచయితల ఉత్సవం

సాహిత్య అకాడమీ & తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘దక్షిణ భారత యువ రచయితల ఉత్సవం’ జూలై 18 ఉ.10గంటల నుంచి రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కథానిక, కవితా పఠనాలు ఉంటాయి. ఈ సభల్లో వరుణ్‌ గులాటి, ఏనుగు నరసింహారెడ్డి, సి. మృణాళిని, ప్రసేన్‌, భూక్యా వర్షిత, నీతా ఎళీలరసి, లక్ష్మీ కె, తంగిరాల నవీన్‌ కుమార్‌, కడలి తదితరులు పాల్గొంటారు.

సాహిత్య అకాడమీ

కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు

కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డుల ప్రదానం జూలై 19ఉ.10.30గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుంది. అవార్డును ఈ ఏడాదికి గాను కార్టూనిస్ట్ నారు, ఆర్టిస్ట్ కూరెళ్ళ శ్రీనివాస్ స్వీకరిస్తారు. ఈ అవార్డు కింద రూ.10,116 నగదు, ప్రశంసాపత్రం ఇస్తారు.

ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్

సినారె ‘విశ్వంభర’ పురస్కారం

డాక్టర్ సినారె ‘విశ్వంభర’ జాతీయ పురస్కారానికి మలయాళ కవి కె. సచ్చిదానందన్ ఎంపికయ్యారు. డాక్టర్ సి. నారాయణరెడ్డి 95వ జయంతి ఉత్సవం సందర్భంగా జూలై 29 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరా బాద్‌లో జరిగే పురస్కార ప్రదాన సభలో సచ్చిదానందన్‌కు రూ.5లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కారం ఉంటుంది. సభకు ముఖ్య అతిథి త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి.

సి. గంగ

కథా సంపుటాలకు ఆహ్వానం

‘విమలా శాంతి కథా పురస్కారం’ కోసం కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. ఉత్తమ కథా సంపుటానికి రూ.10వేల నగదు, జ్ఞాపికతో సత్కారం ఉటుంది. 1.7.2022–30.6.2026 మధ్య కాలంలో ప్రచురితమైన కథా సంపుటాలు నాలుగు కాపీలను జూలై 31 లోపు చిరునామా: అడవాల శేషగిరినాయుడు, సంగీతవాణి, 1–3–21, రిషిత స్కూల్‌ ఎదురుగా, మోతీలాల్‌ స్ట్రీట్‌, శాంతినగర్‌, న్యూటౌన్‌, అనంతపురం – 515004కు పంపాలి.

శాంతినారాయణ

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 01:21 AM