New Year Poem: నిన్న లేని అందం
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:53 AM
ఆది అంతాలను నమోదు చేసే గుమస్తా కాలం ఎప్పుడూ అది కనిపించలేదు కాని దాని అనుక్షణ స్పర్శను కాదనలేం...
ఆది అంతాలను నమోదు చేసే గుమస్తా కాలం
ఎప్పుడూ అది కనిపించలేదు
కాని దాని అనుక్షణ స్పర్శను కాదనలేం
కనిపించని దానికే
విశ్వవ్యాప్తమయ్యే శక్తి ఉంటుందేమో
కలలకు తాకట్టుపడి బతుకుతున్నవాణ్ణి
కాలం ప్రపంచంలోకి నడిపిస్తుంది
కేకులు కోసి కేకలు వేస్తున్నారు
అమ్మాయి వేసిన ముగ్గుమీద
డ్యాన్సు చేస్తూ వెళ్ళాడు తాగుబోతు
గ్రేట్ దేవుణ్ణి గ్రీట్ చేస్తున్నారు భక్తులు
‘నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో’
అంటూ తనలో తానే పాడుకుంటున్నది పాట
రాలిన పూవు పక్కనే పూసింది మరో పూవు
చెవిలో గుసగుసగా చెప్పింది పరిమళం
‘ఈ పూవే కొత్త సంవత్సరమ’ని. ఆ వెంటనే
రెపరెపలాడే కాగితం పెదవులతో
‘హ్యాపీ న్యూయియర్’ చెప్పింది కొత్త క్యాలెండర్
అమ్మంగి వేణుగోపాల్
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..