Share News

నూర్‌బాషా–దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి!

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:30 AM

తెలంగాణలో అత్యంత వెనుకబడిన కులాలలో దూదేకుల కులం ఒకటి. ముస్లిం మైనారిటీలలో అంతర్భాగంగా ఉన్న ఈ కులానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎటువంటి లబ్ధీ చేకూరలేదు. ముఖ్యంగా...

నూర్‌బాషా–దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి!

తెలంగాణలో అత్యంత వెనుకబడిన కులాలలో దూదేకుల కులం ఒకటి. ముస్లిం మైనారిటీలలో అంతర్భాగంగా ఉన్న ఈ కులానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎటువంటి లబ్ధీ చేకూరలేదు. ముఖ్యంగా విద్య, ఉద్యోగాలలోనూ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అత్యంత వెనుకబడి ఉన్న కులమిది. ఇప్పటివరకు వీరికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షలకు పైబడి జనాభా ఉన్న ఈ కులానికి కనీసం ఒక కార్పొరేషన్ కూడా లేదు. వీరి కుల వృత్తి దూదిని సేకరించి అందులో విత్తనాలు వేరు చేసి ఆ దూదితో పరుపులు, దిండ్లు కుట్టి ఊరూరా తిరిగి అమ్ముకోవడం. కాయర్ పరిశ్రమలు వచ్చి వీరి జీవనధారాన్ని పూర్తిగా నాశనం చేశాయి. దాంతో వీరు బ్యాండ్ మేళం, టైలరింగ్, సోడాలు అమ్ముకోవడం, పంచర్ షాప్‌లు, ఇతరత్రా వృత్తులకు మారారు.

ప్రస్తుతం ఈ కులస్తుల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో చదువుకొని ఖాళీగా ఉన్న యువకులు, మహిళలు స్వయం ఉపాధిలో శిక్షణ పొంది గౌరవప్రద జీవనం సాగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దాదాపు 20 కార్పొరేషన్లు ప్రకటించింది. అందులో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఇందులో దూదేకుల కులం లేదు. వీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో గుర్తింపునివ్వాలని. ఈ కులంలో నూటికి 90శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దూదేకుల కులస్తులు కీలకపాత్ర పోషించారు. అలాగే గత ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమిలో ఆత్మగౌరవ భవనం కూడా నిర్మించాలని దూదేకుల కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.

షేక్ అన్వర్ పాషా

అధికార ప్రతినిధి,

తెలంగాణ నూర్‌బాషా–దూదేకుల బీసీ ముస్లిం జేఏసీ

ఈ వార్తలనూ చదవండి:

రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు

హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్

Updated Date - Sep 24 , 2026 | 01:30 AM