Share News

2026 Riding the Waves of Hope: ఆశల అలలపై...

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:56 AM

కాలం వేసిన ఈ కొత్తకొమ్మే రెండువేల ఇరువై ఆరు మారుతున్న రోజులన్నీ ఆ కొమ్మ పూలై వికసిస్తాయి...

2026 Riding the Waves of Hope: ఆశల అలలపై...

కాలం వేసిన ఈ కొత్తకొమ్మే

రెండువేల ఇరువై ఆరు

మారుతున్న రోజులన్నీ

ఆ కొమ్మ పూలై వికసిస్తాయి

నూతన సంవత్సరం ఎప్పుడైనా

గత సంవత్సరం పునాదులపై నిలుచుని

భవిష్యత్‌లోకి అడుగిడుతుంది

విపత్తులొచ్చినా వినోదాలిచ్చినా

కాలం మునుముందుకే నడుస్తుంది

వెనుకంజ దానికి తెలియని నడవడి

కాలంతో పాటు కదలడం ప్రాణి లక్షణం

కదలనని భీష్మించుకోవడం కుదరని పని

ఎవరినైనా తనతో లాక్కు వెళ్ళడమే కాలం ధర్మం

దాని ప్రయాణానికి రెండు చేతులెత్తి

ఆహ్వానించడమే మనకున్న ఏకైక విధి

చైతన్య సాకారమైన కాల పరిణామాలకూ

మార్పులను మోసుకొచ్చే కాల ప్రమాణాలకూ

చేతనమై మొక్కి ప్రణమిల్లుదాం

కోటి కాంతుల ప్రభతో వస్తున్న

నూతన సంవత్సరానికి స్వాగత గీతాలు ఆలపిద్దాం

వై.హెచ్‌.కె. మోహన్‌రావు

ఇవి కూడా చదవండి

ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..

Updated Date - Jan 01 , 2026 | 05:56 AM