Share News

ప్రవాస గీతం

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:47 AM

చించెట్లకవతల మాయా అద్దం లాంటి ఏటి ప్రవాహంలో అదేదో కథలోలాగా తప్పిపోయిన రాకుమారి ముఖం...

ప్రవాస గీతం

చించెట్లకవతల

మాయా అద్దం లాంటి

ఏటి ప్రవాహంలో

అదేదో కథలోలాగా

తప్పిపోయిన

రాకుమారి ముఖం

ఆచూకీ తెలుస్తుందా!?

ఎప్పుడైనా ఊరెళితే

అంతా మరిచిపోయిన

తాళపుచెవి హృదయాన్ని

ఇల్లు గుర్తుపట్టాలంటే

ఎంత సమయం పడుతుందో!?

నైటాల్ట్ బస్సు కిటికీ కంటిలో

ప్రతిబింబించే

మేడమీద లాంతర్ని వెలిగించిన పాట

ఏమయ్యిందో!?

ఆశకి

దుఃఖానికి

మధ్య దూరం ఎంత?

బొంకులుదిబ్బకి

అయ్యకోనేరు చాలా దగ్గర

చించేసిన ఉత్తరం

కలిసిపోయిన మట్టిరేణువులో

ఇంకిపోయిన అక్షరం జీవితం

బూరుగు చెట్టు కిందకు చేరేవరకు

నగరం నడిబొడ్డున

ఒంటరితీగ పలికే

దుఃఖకంపనం

ఓ ప్రవాస గీతం

పాయల మురళీకృష్ణ

83094 68318

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 12:47 AM