Share News

నాన్నకు అప్పు ఉంది

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:41 AM

కాగితాలది కాదు బంధాల మధ్య బతికినందుకు బాధ్యతల అప్పు! బతుకంతా వడ్డీ కడుతూనే ఉన్నాడు...

నాన్నకు అప్పు ఉంది

కాగితాలది కాదు

బంధాల మధ్య

బతికినందుకు

బాధ్యతల అప్పు!

బతుకంతా

వడ్డీ కడుతూనే ఉన్నాడు

చివరి శ్వాస వరకు

చెల్లిస్తూనే ఉంటాడు

తీర్చమని

గల్లా పట్టి ఎవరూ అడగలేదు

కానీ గడప ముందు వచ్చి

దీనంగా కూర్చుంటారు

విశ్రాంతి తీసుకోకు

ఇంకా రుణం మిగిలుందని!

ఎందుకో ఈ అప్పు కట్టేకొద్దీ

ఆయన ముఖం మీద

చిరునవ్వులు పెరుగుతున్నాయి

మనిషై పుట్టాక

ఈ ధనం కాని అప్పు,

మనిషికి ఉండాలేమో!

లేకపోతే బతుకు

ఉప్పులేని పప్పులా ఉంటుందేమో!

బాయికాడి నర్సింలు

90107 81792

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 01:41 AM