మతం మార్చి.. ఓటు బ్యాంకుగా తీర్చిదిద్ది!
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:01 AM
దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో మత మార్పిడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కించిత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? తనను కలుస్తున్న...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పటివరకు సీరియస్‌గా తీసుకోలేదు. క్రైస్తవంలోకి మారినవారు ఆయా రాష్ట్రాలలో ఓటు బ్యాంకుగా మారుతుండటంతో కేంద్ర పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించారు. జోసెఫ్ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో చర్చిలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు సాగుతున్నాయని, అధికారుల పోస్టింగులు కూడా చర్చిలలోనే నిర్ణయిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దక్షిణాదికి చెందిన ఒక కీలక నేత వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఉత్తరాది రాష్ట్రాలలో పార్టీకి తిరుగులేకపోయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలపడకపోవడానికి మత మార్పిడులు ప్రధాన కారణమని ఢిల్లీ పెద్దలుఅభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడి అనేది ఒక ఉద్యమంలా సాగుతోంది. ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైలెంట్‌గా మొదలైన మత మార్పిడి జగన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం తర్వాత ఉద్యమంలా ఊపందుకుంది. రాజకీయాల్లో జగన్ రెడ్డి అరంగేట్రం చేసిన తర్వాతే క్రైస్తవులు బలమైన ఓటు బ్యాంకుగా మారిపోయారు.
తనను తాను క్రైస్తవుడిగా చెప్పుకొనే జగన్ రెడ్డి నిజానికి క్రైస్తవం స్వీకరించవలసిందిగా ఏ ఒక్కరినీ ప్రత్యక్షంగా కోరిన దాఖలాలు లేవు. అయితే ఆయన ఇటీవలి కాలంలో తన సంపాదనలో పది శాతాన్ని చర్చిల అభివృద్ధి పేరిట కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అక్రమ సంపాదన, సక్రమ సంపాదన అన్న తేడా లేకుండా మొత్తం సంపాదనలో పది శాతం చర్చిలకు పంచడం మొదలుపెట్టారని నిన్నటి వరకు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు చెబుతున్నారు.
ఈ పది శాతం నిధుల కేటాయింపు నిజమే అయితే ఆ నిధులతో మత మార్పిడులను ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీలోని అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా ఇటీవలి కాలంలో క్రైస్తవం వైపు ఆకర్షితులవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీలోని ముఖ్య నాయకులు క్రైస్తవం వైపు ఆకర్షితులు కావడానికి కారణం లేకపోలేదు. జగన్ రెడ్డి ప్రత్యేకంగా కోరకపోయినా మెడలో శిలువ వేసుకొని ఆయనకు కనబడితే సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఈ తరహా నేతలు క్రైస్తవులుగా మారిపోతున్నారట! మెడలో శిలువ వేసుకొని జగన్ దృష్టిలో పడితే ఎన్నికల్లో పార్టీ టికెట్ పొందడం, పదవులు దక్కించుకోవడం సులువవుతుందన్న అభిప్రాయంతో ఈ తరహా నాయకులు క్రైస్తవం స్వీకరిస్తున్నారని చెబుతున్నారు.
విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోటలుగా ఉండేవి. అయితే గత కొంత కాలంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పిడులు భారీ స్థాయిలో జరిగాయి. గిరిజనులు పూజించే వన దేవతల స్థానంలో చర్చిలు వెలిశాయి. దాంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ బలంగా మారింది.
మత మార్పిడి అనేది ఏపీలో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా విస్తృతంగా జరుగుతోంది. గ్రామ దేవతలను ఆరాధించే తెలంగాణ ప్రజలు ఇప్పుడు చర్చిల బాట పడుతున్నారు. ఒకప్పుడు మెదక్, నిజామాబాద్, వరంగల్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చర్చిలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా చర్చిలు కనిపిస్తున్నాయి. ఏపీలో వలె తెలంగాణలో కూడా క్రైస్తవులసంఖ్య పెరిగి ఓటు బ్యాంకుగా ఏర్పడితే జగన్ తన పార్టీని తెలంగాణలోనూవిస్తరించే అవకాశం లేకపోలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో వలె తమిళనాడులో కూడా వేల సంఖ్యలో చర్చిలు ఉన్నాయి. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చే వరకు క్రైస్తవులు డీఎంకేకు మద్దతుగానే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జోసెఫ్ విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే దక్షిణాదిన క్రైస్తవ రాజ్యం ఏర్పాటుకు మార్గం సుగమం అయిందన్న ప్రచారం ఊపందుకుంది.
ఇక జోసెఫ్ విజయ్-జగన్ రెడ్డి మధ్య బంధం కూడా బలపడే అవకాశం ఉంది. జోసెఫ్ విజయ్ వద్ద ప్రస్తుతం కీలకంగా ఉన్న విష్ణు రెడ్డి, సుజయ్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి.. జగన్‌కు సన్నిహితులు కావడం గమనార్హం. రాజకీయాలలో అవసరాల ముందు సిద్ధాంతాలు నిలబడవు. నిన్నటి వరకు డీఎంకేకు బీజేపీ బద్ధ శత్రువు. ఇప్పుడు ఉమ్మడి ప్రత్యర్థి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను అడ్డుకోవడం కోసం ఈ రెండు పార్టీలూ చేతులు కలపబోతున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో మత మార్పిడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కించిత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? తనను కలుస్తున్న దక్షిణాది నాయకుల వద్ద ప్రధానమంత్రి ఈ విషయం ప్రస్తావించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాప కింద నీరులా క్రైస్తవంలోకి మత మార్పిడులు కొంత కాలంగా జరుగుతున్న విషయం విదితమే. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళనాడు కూడా ఈ జాబితాలో చేరిందన్నది ప్రధానమంత్రి కార్యాలయానికి చేరిన తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పటివరకు సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ జాబితాలో తమిళనాడు కూడా చేరడం, క్రైస్తవంలోకి మారినవారు ఆయా రాష్ర్టాలలో ఓటు బ్యాంకుగా మారుతుండటంతో కేంద్ర పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించారు. జోసెఫ్ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో చర్చిలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు సాగుతున్నాయని, అధికారుల పోస్టింగులు కూడా చర్చిలలోనే నిర్ణయిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దక్షిణాదికి చెందిన ఒక కీలక నేత వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దక్షిణాది పరిణామాలతో వాటికన్ సిటీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టుగా తన దృష్టికి వచ్చిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు, గతంలో పనిచేసినవాళ్లు ఈ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నట్టు ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయని పక్షంలో దక్షిణాదిని క్రైస్తవ రాజ్యంగా మార్చివేస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట! ఉత్తరాది రాష్ర్టాలలో పార్టీకి తిరుగులేకపోయినప్పటికీ దక్షిణాది రాష్ర్టాలలో పార్టీ బలపడకపోవడానికి మత మార్పిడులు ప్రధాన కారణమని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రాష్ర్టాలలో క్రైస్తవుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అక్కడ అధికారంలోకి రాగలిగాం కనుక దక్షిణాదిన జరుగుతున్న మత మార్పిడులు పార్టీ ఎదుగుదలకు అడ్డుకాబోవని ఇప్పటివరకు భావించారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత బీజేపీ పెద్దలు తమ అభిప్రాయం మార్చుకున్నారు. దక్షిణాది రాష్ర్టాలలో క్రైస్తవంలోకి మత మార్పిడులు ఒక పథకం ప్రకారమే జరుగుతున్నాయని, ఇలా క్రైస్తవ మతం స్వీకరించిన వారంతా ఆయా రాష్ర్టాలకు చెందిన పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నారని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడి అనేది ఒక ఉద్యమంలా సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైలెంట్‌గా మొదలైన మత మార్పిడి జగన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం తర్వాత ఉద్యమంలా ఊపందుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్తవులలో అత్యధికులు జగన్‌రెడ్డికి ఓటు బ్యాంకుగా మారిన విషయం బహిరంగ రహస్యమే. గత ఎన్నికలలో జగన్‌రెడ్డికి 40శాతం వరకు ఓట్లు రావడానికి క్రైస్తవుల ఓట్లే ప్రధాన కారణమన్న విశ్లేషణ కూడా ఉంది. జగన్‌రెడ్డితో విభేదించి సొంత పార్టీ ప్రారంభించే పనిలో ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఈ మత మార్పిడులపై తరచుగా మాట్లాడుతున్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఈ మత మార్పిడులు ఉన్నప్పటికీ అప్పట్లో క్రైస్తవుల సంఖ్య స్వల్పంగా ఉండేది. అంతే కాకుండా వారు ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేదా రాజకీయ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండేవారు కాదు. హిందువులలోని అగ్ర వర్ణాల నిరాదరణకు గురైనవారు, దేవాలయాలలో ప్రవేశానికి నోచుకోని వర్గాలు మాత్రమే క్రైస్తవ మతంలోకి ఆకర్షితులయ్యారు. గత రెండు దశాబ్దాలుగా తెలుగునాట పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలలో వైఎస్ కుటుంబం ప్రాబల్యం పెరిగిన తర్వాత మత మార్పిడుల అంశం తరచుగా చర్చకు వస్తోంది. రాజశేఖరరెడ్డి తనను తాను క్రైస్తవుడిగా ప్రచారం చేసుకోలేదు. నిజానికి ఆయన క్రైస్తవుడు అని అప్పట్లో చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్‌రెడ్డి అరంగేట్రం చేసిన తర్వాతే క్రైస్తవులు బలమైన ఓటు బ్యాంకుగా మారిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఈ ఓటు బ్యాంకును మరింత విస్తరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. తనను తాను క్రైస్తవుడిగా చెప్పుకొనే జగన్‌రెడ్డి నిజానికి క్రైస్తవం స్వీకరించవలసిందిగా ఏ ఒక్కరినీ ప్రత్యక్షంగా కోరిన దాఖలాలు లేవు. అయితే ఆయన ఇటీవలి కాలంలో తన సంపాదనలో పది శాతాన్ని చర్చిల అభివృద్ధి పేరిట కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అక్రమ సంపాదన, సక్రమ సంపాదన అన్న తేడా లేకుండా మొత్తం సంపాదనలో పది శాతం చర్చిలకు పంచడం మొదలుపెట్టారని నిన్నటి వరకు ఆయనతో సన్నిహితంగా మెలిగినవాళ్లు చెబుతున్నారు. జగన్‌రెడ్డితో పోల్చితే ఆయన భార్య భారతిరెడ్డికి భక్తి ఎక్కువ అని అంటారు. భారతిరెడ్డి సూచన మేరకే సంపాదనలో పది శాతం నిధులు చర్చిలకు కేటాయించడానికి జగన్‌రెడ్డి అంగీకరించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పది శాతం నిధుల కేటాయింపు నిజమే అయితే ఆ నిధులతో మత మార్పిడులను ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తన ఓటు బ్యాంకు విస్తరణపై జగన్‌రెడ్డి దృష్టి సారించారని భావించవచ్చు. ఈ విషయం అలా ఉంచితే, వైసీపీలోని అగ్రవర్ణాలకు చెందినవారు కూడా ఇటీవలి కాలంలో క్రైస్తవం వైపు ఆకర్షితులవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు హిందువులుగా ఉన్న కుటుంబాలు అనూహ్యంగా క్రైస్తవం వైపు ఆకర్షితులవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీలోని ముఖ్య నాయకులు క్రైస్తవం వైపు ఆకర్షితులు కావడానికి కారణం లేకపోలేదు. జగన్‌రెడ్డి ప్రత్యేకంగా కోరకపోయినా మెడలో శిలువ వేసుకొని ఆయనకు కనబడితే సంతోషిస్తారన్న ఉద్దేశంతో ఈ తరహా నాయకులు క్రైస్తవులుగా మారిపోతున్నారట! మెడలో శిలువ వేసుకొని జగన్‌రెడ్డి దృష్టిలో పడితే ఎన్నికల్లో పార్టీ టికెట్ పొందడం, పదవులు దక్కించుకోవడం సులువవుతుందన్న అభిప్రాయంతో ఈ తరహా నాయకులు క్రైస్తవం స్వీకరిస్తున్నారని చెబుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం క్రైస్తవ మతాన్ని ఆచరిస్తోందన్న విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. ఆయన కోడలు మొదటిసారిగా ఈ విషయం బయటపెట్టారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తన ఇంట్లో క్రైస్తవ ప్రార్థనలు చేసిన వీడియో బయటకు వచ్చింది. కాకినాడకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా మెడలో శిలువ ధరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరు ఏ మతాన్నయినా స్వీకరించవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం మత మార్పిడి జరగడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒకప్పుడు పేదలను, ముఖ్యంగా దళితులను ఆకర్షించడం కోసం ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపి క్రైస్తవంలోకి మార్చేవారు. ఇప్పుడు పార్టీ టికెట్ కోసం, పదవుల కోసం మత మార్పిడులు జరగడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.
తెలంగాణపైనా జగన్ ఆశలు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మత మార్పిడులకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఏర్పడింది. అది వైసీపీకి మాత్రమే ప్రధాన బలంగా మారింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవారు. అయితే గత కొంతకాలంగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పిడులు భారీ స్థాయిలో జరిగాయి. గిరిజనులు పూజించే వన దేవతల స్థానంలో చర్చిలు వెలిశాయి. దాంతో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ బలంగా మారింది. అరకు ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోగలిగింది. మత మార్పిడుల ప్రభావం రాజకీయాలపై ఉంటుంది అనడానికి ఇదొక కేస్ స్టడీ! క్రైస్తవ ఓటు బ్యాంకును మరింత విస్తరించుకొని, సంఘటితం చేసుకుంటే తమ పార్టీకి ఓటమి అంటూ ఉండదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆ పార్టీకి చెందిన అగ్రవర్ణాల నాయకులు కూడా మతం మార్చుకోవడానికి వెనుకాడటం లేదు. మత మార్పిడి అనేది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా విస్తృతంగా జరుగుతోంది. గ్రామ దేవతలను ఆరాధించే తెలంగాణ ప్రజలు ఇప్పుడు చర్చిల బాట పడుతున్నారు. ఒకప్పుడు మెదక్, నిజామాబాద్, వరంగల్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చర్చిలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా చర్చిలు కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో వలె క్రైస్తవులు ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేక నాయకుడికో ఓటు బ్యాంకుగా మారలేదు. తెలంగాణలోని చర్చిలలో కూడా ఎన్నికల్లో జగన్‌రెడ్డి గెలుపు కోసం ప్రార్థనలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో వలె తెలంగాణలో కూడా క్రైస్తవుల సంఖ్య పెరిగి ఓటు బ్యాంకుగా ఏర్పడితే జగన్‌రెడ్డి తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వలె తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య రాజకీయం నడుస్తోంది. వైసీపీని తెలంగాణలో కూడా విస్తరించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ బలమైన నాయకుడు లభించని కారణంగా ఆ ప్రయత్నాలు ఊపందుకోవడం లేదు. అయితే తెలంగాణ క్రైస్తవులను కూడా తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి జగన్‌రెడ్డికి ఎంతోసేపు పట్టదని చెప్పవచ్చు. క్రైస్తవుల సంఖ్య పెరిగేకొద్దీ జగన్‌రెడ్డి ఆలోచనలు కూడా మారవచ్చు.
తమిళనాట డీఎంకేతో జట్టు కట్టి..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరసన తమిళనాడు కూడా చేరింది. తాజా ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ అధికారంలోకి రావడంలో క్రైస్తవుల సహకారం కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వలె తమిళనాడులో కూడా వేల సంఖ్యలో చర్చిలు ఉన్నాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే డీఎంకే నాయకులు క్రైస్తవులను ప్రోత్సహించారు. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చే వరకు క్రైస్తవులు డీఎంకేకు మద్దతుగానే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్రైస్తవులు, చర్చిల సమాఖ్య టీవీకే పార్టీకి అండగా ఉంటున్నాయి. జోసెఫ్ విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే దక్షిణాదిన క్రైస్తవ రాజ్యం ఏర్పాటుకు మార్గం సుగమం అయిందన్న ప్రచారం ఊపందుకుంది. కేరళలో ఇప్పటికే క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఆ రాష్ట్రంలోని క్రైస్తవులు ఏ ఒక్క పార్టీకో ఓటు బ్యాంకుగా మారలేదు. మున్ముందు ఎలా ఉంటుందో తెలియదు. కేరళలో వలె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో క్రైస్తవుల సంఖ్య పెరిగేకొద్దీ వారు ఓటు బ్యాంకుగా మారిపోయి రాజకీయ ముఖచిత్రాలను మార్చివేసే శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వద్ద ప్రస్తుతం కీలకంగా ఉన్న విష్ణురెడ్డి, సుజయ్‌రెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. తమిళనాడులో క్రైస్తవ మత పెద్దలు ప్రస్తుతం క్రియాశీలకం అయ్యారు. ఫలితంగా జోసెఫ్ విజయ్–జగన్‌రెడ్డి మధ్య బంధం కూడా బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పరిణామాలపై కేంద్రం దృష్టి సారించింది. వాటికన్ సిటీ పెద్దల పర్యవేక్షణలో దక్షిణాది రాష్ర్టాలలో క్రైస్తవ మత వ్యాప్తికి జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రానికి సమాచారం అందింది. ఉత్తరాది రాష్ర్టాలలో హిందువులను సంఘటితం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు దక్షిణాదిపై దృష్టిసారించడం మొదలుపెట్టారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కట్టడి చేయడం కోసం డీఎంకేతో చేతులు కలపాలని బీజేపీ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా బీజేపీ నేతలతో మాట కలుపుతున్నారు. రాజకీయంగా కలసిమెలసి నడవాలని నిర్ణయించుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల డీలిమిటేషన్ బిల్లు విషయంలో కూడా ఎన్డీయే ప్రభుత్వానికి పరోక్ష మద్దతు ఇవ్వడానికి డీఎంకే సుముఖత వ్యక్తంచేస్తోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎదుగుదల కట్టడికి కృషి చేస్తే బీజేపీతో చేతులు కలపడానికి తాము సిద్ధమేనని డీఎంకే ఇప్పటికే ఢిల్లీకి సంకేతాలు పంపింది. రాజకీయాలలో అవసరాల ముందు సిద్ధాంతాలు నిలబడవు. నిన్నటి వరకు డీఎంకేకు భారతీయ జనతా పార్టీ బద్ధ శత్రువు. ఇప్పుడు ఉమ్మడి ప్రత్యర్థి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను అడ్డుకోవడం కోసం ఈ రెండు పార్టీలూ చేతులు కలపబోతున్నాయి.
వై నాట్ తమిళనాడు?
మొత్తంమీద దక్షిణాది రాష్ట్రాలలో క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోని పక్షంలో భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిన భవిష్యత్తు ఉండదన్న అభిప్రాయానికి బీజేపీ పెద్దలు కూడా వచ్చారు. తమిళనాడుతో పాటు తెలంగాణలో మరింత బలపడి అధికారంలోకి రావాలని ఆ పార్టీ తలపోస్తోంది. కేరళలో ఓటు బ్యాంకును పెంచుకోగలిగినప్పుడు తమిళనాడులో అది ఎందుకు సాధ్యం కాదు అన్నది ఆ పార్టీ అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు డీఎంకే కూడా తమతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నందున తమిళనాడులో సొంతంగా కాకపోయినా ఆ పార్టీతో కలసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ నాయకుల సంకల్పంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్డీయే అధికారంలో ఉంది. కూటమి పార్టీలు భవిష్యత్తులో కూడా కలసి మెలసి నడవాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. ఈ కారణంగా కూటమిలో బీజేపీ ప్రాధాన్యాన్ని తీసిపారేయలేము. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చివరి వరకు బీజేపీతో కలసి నడవాలనే అనుకుంటున్నారు. ఈ కారణంగా కూటమి ఐక్యతకు ముప్పేమీ లేదు. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన కీలక నేత వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దక్షిణాది రాష్ర్టాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల ప్రమాదాన్ని బీజేపీ పెద్దలు ఇప్పటికైనా గుర్తించడం ముదావహం అని హిందూ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే మత మార్పిడుల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకొనేలోపే తన క్రైస్తవ ఓటు బ్యాంకును మరింత విస్తరించుకోవాలన్న పట్టుదలతో జగన్‌రెడ్డి ఉన్నట్టు కూడా చెబుతున్నారు. విషాదం ఏమిటంటే ఒకప్పుడు సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలు సాగిన దక్షిణాదిలో ఇప్పుడు మత ప్రాతిపదికన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలను కుల మత ప్రాతిపదికన చీల్చడం సులువు కనుక రాజకీయ పార్టీలు సహజంగానే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇప్పటివరకు హిందువులు, ముస్లింలు మాత్రమే ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా దక్షిణాదిన క్రైస్తవ ఓటు బ్యాంకు ఏర్పడింది. ఈ పరిస్థితి మునుముందు ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి!
ఆర్కే