Share News

ఈపీఎఫ్‌ఓకు ఈసారీ చేతులు రాలేదా?

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:52 AM

ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖా మంత్రి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 240వ సీబీటీ సమావేశంలో ఈపీఎస్‌ కనీస పింఛను పెంపు గురించి నిర్ణయం తీసుకొని...

ఈపీఎఫ్‌ఓకు ఈసారీ చేతులు రాలేదా?

ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖా మంత్రి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 240వ సీబీటీ సమావేశంలో ఈపీఎస్‌ కనీస పింఛను పెంపు గురించి నిర్ణయం తీసుకొని, ప్రస్తుతమున్న కనీస పింఛను వెయ్యి రూపాయలను 3 వేలకు పెంచుతారని దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్‌వో పెన్షన్‌దారులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, కనీస పింఛను పెంపు గురించి ఏ ప్రకటనా రాకపోవడంతో వారంతా ఎంతో నిరాశ చెందుతున్నారు. ఒక పక్క ఈపీఎఫ్‌వో వద్ద 13శాతంతో వృద్ధి చెందుతున్న రూ.11 లక్షల కోట్ల కార్పస్ ఉందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నా, ప్రైవేటు రంగంలో దశాబ్దాలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వర్తించే ఈపీఎస్ మినిమం పెన్షన్ మాత్రం పెరగడం లేదు. గత రెండు దశాబ్దాలుగా కేవలం వెయ్యి రూపాయల పెన్షనే కొనసాగుతూ వస్తోంది. గౌరవప్రదంగా బతికేందుకు ఈ వెయ్యి రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏ చదువూ, ఉద్యోగమూ చేయని వారికి నెలకు నాలుగు వేల రూపాయల వరకూ వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాయి. సీబీటీ సమావేశం జరిగిన ప్రతిసారీ కనీస పింఛను పెంచుతారని లక్షల మంది పెన్షన్‌దారులు ఆశగా ఎదురుచూడటం తప్ప వాస్తవంలో కనీస పెన్షన్ పెంచే సూచనలు మాత్రం కనిపించడం లేదు.

దాసం వెంకటరెడ్డి (బెంగళూరు)

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 01:52 AM