Share News

అనాథ శవాలను మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 03 , 2026 | 01:56 AM

మెడికల్‌ కళాశాలల్లో పీజీ వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్‌ విజ్ఞానం ఎంతో అవసరం. భవిష్యత్‌లో వారు ఏ ఆపరేషన్‌ చేయాలన్నా ప్రాక్టికల్‌ విజ్ఞానం కావాల్సిందే. ఈ ప్రయోగాల కోసం...

అనాథ శవాలను మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలి

మెడికల్‌ కళాశాలల్లో పీజీ వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు థియరీ కంటే ప్రాక్టికల్‌ విజ్ఞానం ఎంతో అవసరం. భవిష్యత్‌లో వారు ఏ ఆపరేషన్‌ చేయాలన్నా ప్రాక్టికల్‌ విజ్ఞానం కావాల్సిందే. ఈ ప్రయోగాల కోసం వైద్య విద్యార్థులకు అవసరమైన మృతదేహాలు అందుబాటులో ఉండడం లేదని నిత్యం పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరో వైపు, పలు ఆస్పత్రుల్లోని మృతదేహాలను మాఫియా గ్యాంగ్‌ మాయం చేసి, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అమ్ముకుంటున్నారనే కథనాలూ వింటున్నాం.

సాధారణంగా, అనాథ శవాలను మార్చురీలో ఉంచి, అయిదు రోజుల వరకూ సిబ్బంది వేచిచూస్తారు. అప్పటికీ మృతుల తాలూకు బంధువులెవరూ రాకపోతే ఆయా శవాలను మునిసిపాలిటీ సిబ్బందికి అప్పగించి, అంత్యక్రియలు చేయమని చెబుతారు. అలా అనాథ శవాలను పూడ్చిపెట్టే బదులు వైద్య కళాశాలలకు ఇస్తే, డాక్టరు కోర్సు చదివే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. వారు ప్రాక్టికల్‌గా శవాల మీద వైద్య ప్రయోగాలు చేసి మానవ శరీర నిర్మాణాన్ని గురించి మరింతగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలి. అంతేగాక, మరణానంతరం తమ దేహాలను మెడికల్‌ ఆస్పత్రులకు ఇవ్వడానికి ప్రజలు కూడా ముందుకురావాలి.

ముద్దంశెట్టి రమణమూర్తి

విజయవాడ

ఇవి కూడా చదవండి

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

Updated Date - Mar 03 , 2026 | 01:56 AM