అమరత్వం
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:41 AM
నక్షత్రమొకటి నేలమీది వెలుగు చుక్కల్ని తాకింది. మెరుపులు విచ్చుకున్నాయి. ఆకాశపుచెట్టు చప్పట్లు చరుస్తూ...
నక్షత్రమొకటి నేలమీది
వెలుగు చుక్కల్ని తాకింది.
మెరుపులు విచ్చుకున్నాయి.
ఆకాశపుచెట్టు
చప్పట్లు చరుస్తూ
మేఘాలకు సైగ చేసింది.
దట్టంగా అలుముకున్న
చిక్కదనంతో
అడవి ఆరాటపడి
చేతులు చాచింది.
ఊరువాడా వదిలిన పాదాలన్నీ
నడక నేర్చుకుని
రేపటికలను కంటూనే వున్నాయి.
కల ఎప్పుడూ నిజమే
కవితెప్పుడూ చలనమే
జీవితమొక గాజుముక్కే
జీవనమొక నెత్తుటి స్నానమే
ఇప్పుడే ఇపుడిప్పుడే
గొంతులో స్వేచ్ఛ నిండుతోంది
-శిలాలోలిత
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా