Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. కన్యారాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 09:31 AM

కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. కన్యారాశి ఫలితాలు..

(ఉత్తర 2,3,4; హస్త; చిత్త 1,2 పాదాలు)

ఆదాయం: 8, వ్యయం: 11; రాజపూజ్యం: 3, అవమానం: 3

కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడా రంగంలోని వారు విశేషంగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం మార్పు విషయంలో మీ సంకల్పం నెరవేరుతుంది. విహార , వినోద యాత్రలు ఆనందం కలిగిస్తాయి. బృందకార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. ఖర్చులు పెరుగుతాయి.


గురువు ఈ ఏడాది 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ప్రమోషన్లు లభిస్తాయు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. డిజైనర్లు, పరిశోధకులు, ప్రచురణకర్తలు, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక, సేవా రంగాల్లోని వారు లక్ష్యాలు సాధిస్తారు. డిసెంబరు 14 నుంచి ఏడాది చివరి వరకు గురువు వక్రించి ఉండటంతో ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. పెద్దల సహకారం లోపించడంతో లక్ష్య సాధన కష్టంగా మారుతుంది. విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికం. కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


ఈ ఏడాది 7వ స్థానంలో శని సంచారం ఫలితంగా భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆటంకాలు, ఆలస్యాలు చికాకు పెడతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణ భారం పెరుగుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జూలై 27 - డిసెంబరు 11 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్‌ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచార ఫలితంగా వైద్య రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. బంధువుల వ్యవహారశైలి మనస్తాపం కలిగిస్తుంది. దూరప్రయణాలకు ఖర్చు చేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

శీతలా దేవి ఆరాధన శుభఫలితాన్నిస్తుంది.

Updated Date - Mar 19 , 2026 | 09:31 AM