Share News

నేటి రాశి ఫలాలు.. 15-09-2026

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:46 AM

నేటి రాశి ఫలాలు.. సోమవారం 15-09-2026

నేటి రాశి ఫలాలు.. 15-09-2026

నేటి రాశి ఫలాలు.. సోమవారం 14-09-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విందు వినోదాల కోసం ఖర్చుల చేస్తారు. బీమా, హోటల్‌, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


02 VRUSHABHAM.jpgవృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆడిటింగ్‌, క్రీడలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఇల్లు, స్థల సేకరణకు కావలసిన నిధులు సర్దుబాటు అవుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది. మార్కెటింగ్‌, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


07 TULA.jpgతుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

టెలివిజన్‌, ఎగుమతులు, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. బృంద కార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. న్యాయ, బోధన, సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలు అందుకుంటారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాలు, వేడుక ల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బీమా, మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. అడ్వాన్సులు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు)

న్యాయ, బోధన, ప్రచురణలు, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

Updated Date - Sep 15 , 2026 | 07:46 AM