Share News

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. వృషభరాశి ఫలితాలు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:42 AM

వృషభ రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్‌లు అందుకుంటారు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం.. వృషభరాశి ఫలితాలు..

(కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం: 5, వ్యయం: 14; రాజపూజ్యం: 5, అవమానం: 4

వృషభ రాశివారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్‌లు అందుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. గృహ యోగం ఉంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తిని పెంపొందించుకుంటారు. కొత్త స్నేహాలు, పరిచయాలు లాభిస్తాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సినిమాలు, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది.


ఈ ఏడాది 2,3,4 స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. స్టీలు, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామగ్రి వ్యాపారులు, ఫర్నిచర్‌ రంగాల వారు లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. డిసెంబరు 14 నుంచి సంవత్పరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. సన్నిహితులతో మనస్పర్థలు ఏర్పడే ప్రమాదం ఉంది.


ఏడాది మొత్తం మీ లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. శతృబాధ అధికం. జూలై27 నుంచి డిసెంబరు 11 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు.


ఉగాది నుంచి డిసెంబరు 6 వరకు సింహ-కుంభాల్లో ఆ తరువాత కర్కాటక-మకర రాశుల్లో రాహు కేతువుల సంచారం కారణంగా విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగంలో బదిలీలు అసంతృప్తి కలిగిస్తాయి. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. తల్లి ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల ఆస్తులకు సంబంఽధించిన విషయాల్లో చికాకులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది.

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Updated Date - Mar 19 , 2026 | 09:18 AM