Share News

అశ్వవాహనంపై ఆది దంపతులు

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:51 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.

అశ్వవాహనంపై ఆది దంపతులు

  • శ్రీశైలంలో ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. 11వ రోజు నవవాహ్నిక దీక్షతో అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అశ్వవాహన సేవ నిర్వహించారు. అనంతరం ఆలయోత్సవం జరిపారు. చెంచుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, కోలాటల నడుమ ఆలయోత్సవం సాగింది. పుష్పోత్సవంలో భాగంగా 21 రకాలైన సుగంధ పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం నుంచి ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను పునఃప్రారంభించనున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 04:52 AM