శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీనరాశి ఫలితాలు..
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:18 AM
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి.
(పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం: 14, వ్యయం: 11; రాజపూజ్యం: 7, అవమానం: 5
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకుంటారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంవత్సరాంతంలో కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, ఔషధ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
గురువు 4,5,6 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. బదిలీలు, మార్పులకు అనుకూలం. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. టెలివిజన్, సినిమాలు, క్రీడలు, ఆడిటింగ్, ప్రకటనలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. టీచింగ్, సాంకేతిక శిక్షణ, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ప్రయో గాలు చేసి విజయం సాధిస్తారు.
ఆరోగ్యం పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. డిసెంబరు 14 నుంచి సంవత్స రాంతం వరకు గురువు వక్రించినందున ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు శ్రమకు తగిన ఫలితం కోసం అధికంగా శ్రమించాలి. సహోద్యోగుల సహకార లోపం ఫలితంగా లక్ష్య సాధన కష్టం అవుతుంది.
శ్రీ ఆంజనేయస్వామిని ఆరాధించడం మంచిది