Share News

నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 17 , 2026 | 06:38 AM

నేటి రాశిఫలాలు 17-05-2026, అదివారం

నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు సత్ఫలితాలనిస్తాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక శుభవార్త అందుకుంటారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లు, టీచర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌ ఆనందం కలిగిస్తుంది.


03 MIDHUNAM.jpg

మిథునం ( మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. దూరప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి.


04 KARKATAM.jpg

కర్కాటకం ( జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ గమనం, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాలకు అనుకూలం. ఒక రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీరంగాల వారు కీలక పదవులు చేపడతారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేసి, పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వారి సహకారంతో పురోగతి సాధిస్తారు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పారితోషికాలు, ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. పట్టుదలతో పనిచేసి.. అంచనాలు అందుకుంటారు. ప్రచురణకర్తలు, కళాకారులు, న్యాయవాదులు, బోధకులకు ప్రోత్సాహకరమైన రోజు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పందేలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. మరమ్మతులు, ఫైనాన్స్‌ వ్యాపారులకు అనుకూలమైన రోజు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23- డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

విందు, వినోదాల్లో పాల్గొంటారు. పందేలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై గెలుపు మీదే అవుతుంది. కొత్త భాగస్వామ్యాలు, కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం. జన సంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యం, ఫార్మా, హోటల్‌, నిత్యావసర రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విద్యా విషయాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుబంధాలు బలపడతాయి.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఇల్లు, స్థలం మార్పు కోసం చేస ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఫర్నిచర్‌, గృహోపకరణాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 17 , 2026 | 06:46 AM