Share News

నేటి రాశి ఫలాలు.. శనివారం 28-11-2026

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:14 AM

మేషం నుంచి మీనం వరకు ఈ రోజు (శనివారం) 28-11-2026.. రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు.. శనివారం 28-11-2026
Today Horoscope

నేటి రాశి ఫలాలు.. శనివారం 28-11-2026

01 MESHAM.jpgమేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి


02 VRUSHABHAM.jpgవృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpgమిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpgకర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.


05 SIMHAM.jpgసింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులకు సంబంధించ రహస్య సమాచారం తెలుసుకుంటారు. సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్‌, ఎగుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.


06 KANYA.jpgకన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఇంట్లో వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


07 TULA.jpgతుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.


08 VRUSCHIKAM.jpgవృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpgధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మరమ్మతులు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు. శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


10 MAKARAM.jpgమకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpgకుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

అదనపు ఆదాయం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


12 MEENAM-FINAL.jpgమీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. క్రీడలు, విద్య, ఆడిటింగ్‌, టెలివిజన్‌, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Nov 28 , 2026 | 01:34 AM