Share News

నేటి రాశి ఫలాలు.... ఎలా ఉన్నాయంటే.

ABN , Publish Date - May 06 , 2026 | 05:19 AM

నేటి రాశిఫలాలు 6-05-2026 (బుధవారం)

నేటి రాశి ఫలాలు.... ఎలా ఉన్నాయంటే.

నేటి రాశిఫలాలు 6-05-2026 (బుధవారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వ్యాపార రంగంలోని వారు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిధుల విషయంలో పెద్దల తోడ్పాటు లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. మహాగణపతి ఆరాధన శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మీ అంచనాలు ఫలించకపోవచ్చు. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ప్రచురణలు, రవాణా, న్యాయ, బోధన రంగాల వారు కొత్త పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.


03 MIDHUNAM.jpg

మిథునం ( మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆస్తిపాస్తుల విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఉన్నత విద్యకు అవసర మైన నిధులు సర్దుబాటు అవుతాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. వైద్యం, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి.


04 KARKATAM.jpg

కర్కాటకం ( జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విలాసాలకు ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

మీ పతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహపడతారు. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్‌, రచనలు, కళలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సృజనాత్మక రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదానం శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. స్థిరాస్తి రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాలను మీ వైఖరిని సమీక్షించుకుంటారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్లు, మార్కెటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. బందుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఆడ్వర్టయిజ్‌మెంట్స్‌, కన్సల్టెన్సీ, చిట్‌ఫండ్‌, టెలివిజన్‌, కళలు, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. గృహారంభ ప్రవేశాలకు సన్నాహాలు చేసుకుంటారు. ఇల్లు, స్థలసేకర ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. గోమాత ఆరాధన శుభప్రదం.

శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - May 06 , 2026 | 05:19 AM