నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 30 , 2026 | 06:05 AM
నేటి రాశిఫలాలు 30-4-2026 (గురువారం)
నేటి రాశిఫలాలు 30-4-2026 (గురువారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖర్చులు.. అంచనాలు మించే అవకాశం ఉంది. పందేలు, పోటీల్లో నిదానం అవసరం. సాయినాథుని దర్శనం శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దత్తకవచ పారాయణం శుభప్రదం.

మిథునం ( మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్, క్రీడలు తదితర రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. వేడుకల్లో ఖర్చులు అధికం. గోమాతను సేవించండి.

కర్కాటకం (జూన్ 22-జూలై23 మధ్య జన్మించిన వారు)
ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారు.. తమ పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వాదానికి దూరంగా ఉండాలి. సాయి సచ్చరిత్ర పారాయణం శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన నిర్ణయాల్లో తొందరపాటు తగదు. నిధులు సకాలంలో చేతికి అందకపోవచ్చు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం మంచిది. వేడుకలు, సమావేశాల్లో ఖర్చులు అధికం. పందేలు, పోటీల్లో నిదానం పాటించండి. దత్తకవచ పారాయణం శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సాయి సచ్చరిత్ర పారాయణం శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆడిటింగ్, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారు నిదానం పాటించాలి. గోసేవ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలం. పెద్దలు, ఉన్నతాధికారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. వాగ్వాదానికి దూరంగా ఉండండి. సాయినాథుని ఆలయాన్ని దర్శించండి.

మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చులు అధికం. పెన్షన్, మూచ్యువల్ ఫండ్స్ వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోమాత ఆరాధన శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ