Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ దీర్ఘకాల కోరిక నెరవేరుతుంది

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:12 AM

నేడు రాశి ఫలాలు 29-3-2026 ఆదివారం, బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు...

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ దీర్ఘకాల కోరిక నెరవేరుతుంది

నేడు రాశి ఫలాలు 29-3-2026 ఆదివారం, బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ఉదయం 9 తరువాత ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. శ్రీ సూర్యభగవానుడిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. ఉదయం 9 తరువాత రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ ర ంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు పట్టుదలతో పూరి చేస్తారు. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం ( మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు. యూనియన్‌ కార్యకలాపాలకు అనుకూలం. ఉదయం 9 గంటల నుంచి కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో కొంత నిదానం పాటించాలి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటల తరువాత బోనస్‌లు, ఇంక్రి మెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. సూర్యారాధన శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ఉదయం 9 గంటల తరువాత ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. నూతన భాగస్వామ్యాలు, కొత్త పనులు ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉదయం 9 గంటల తరువాత ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించాలి. రాజకీయ, సినీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉదయం 9 గంటల తరువాత శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉదయం 9 గంటల నుంచి ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉదయం 9 గంటల తరువాత సమావేశాలు, వేడుకల్లో శ్రమాధిక్యం కలుగుతుంది. సినిమాలు, టెలివిజన్‌, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. గోసేవ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఉదయం 9 గంటల తరువాత కుటుంబ సభ్యుల సహకారం లోపించడంతో ఆర్థికంగా చిక్కులు ఎదురవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు అందడంలో జాప్యం కావచ్చు. సూర్యాష్టక పారాయణ మేలు చేస్తుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు. ఉయదం 9 గంటల తరువాత కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చర్చలు, ప్రయాణాల్లో నిదానం పాటించండి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు అందుతాయి. ఉదయం 9 గంటల తరువాత సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడి ఎదురువుతుంది. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Mar 29 , 2026 | 12:12 AM