నేటి రాశి ఫలాలు.... ఎలా ఉన్నాయంటే.....
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:38 AM
నేటి రాశిఫలాలు 27-4-2026 (సోమవారం)
నేటి రాశిఫలాలు 27-4-2026 (సోమవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
జీతభత్యాలు పెరిగేందుకు అవకాశం ఉంది. అదనపు ఆదాయం అందుకుంటారు. వైద్యం, సేవల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్య సేవల కోసం ఖర్చు చేస్తారు. ఆదాయం పెంపొందించుకుంటారు.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. టెలివిజన్, సినిమా రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ప్రేమానుబంధాలు బలపడతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సంకల్పం ఫలిస్తుంది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇల్లు మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. చేపట్టిన పనులను సమీక్షించుకుంటారు. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, బృందకార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్త అందుకుంటారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల తోడ్పాటు లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మంచిది

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విద్య, రక్షణ, న్యాయ, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు కోసం వ్యూహాత్మకంగా పనిచేసి విజయం సాధిస్తారు. శుభవార్త అందుకుంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగపడుతుంది. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, హోటల్, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి కీలకమైన సమాచారం లభిస్తుంది.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షింకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
భాగస్వామితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ