ఈ రాశి వారికి గుడ్ న్యూస్ జీవితంలో కొత్త మలుపు
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:33 AM
నేడు రాశిఫలాలు 26-3-2026 - గురువారం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు...
నేడు రాశిఫలాలు 26-3-2026 - గురువారం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాలో కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యాహ్నం నుంచి మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. మధ్యాహ్నం నుంచి కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి పెద్దలు, పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం గురించి ఆలోచిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. ఉన్నత విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సన్నిహతుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. మధ్యాహ్నం నుంచి వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం నుంచి న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. మధ్యాహ్నం నుంచి బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పూర్తవుతాయి. పెట్టుబడుల వ్యవహారాలకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. మధ్యాహ్నం నుంచి వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మధ్యాహ్నం నుంచి సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. సన్నిహితులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. మధ్యాహ్నం నుంచి క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ