నేటి రాశి ఫలాలు... ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 25 , 2026 | 05:47 AM
నేటి రాశిఫలాలు 25-05-2026, (సోమవారం)
నేటి రాశిఫలాలు 25-05-2026, (సోమవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఫార్మా, హోటల్, ఆహార పదార్థాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయం విషయంలో పెద్లలు, తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. పరమేశ్వరుని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రహస్య సమాచారం తెలుసుకుంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంలతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, వివాహ విషయాలు పెద్దలతో చర్చిస్తారు. లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ప్రచురణలు, విద్య, కళా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతమలు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. వైద్య సేవలకు అవసరమైన నిదులు సర్దుబాటు అవుతాయి. పాతబకాయిలు వసూలవుతాయి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ