ఈ రాశి వారికి గుడ్ న్యూస్ ఆదాయం పెరిగే మార్గాలు తెరుచుకుంటాయి
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:03 AM
నేడు రాశిఫలాలు 24-3-2026 - మంగళవారం విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది...
నేడు రాశిఫలాలు 24-3-2026 - మంగళవారం విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. చర్చలు ఫలిస్తాయి. వాహన యోగం ఉంది. మార్కెటింగ్, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక సమాచారం అనందం కలిగిస్తుంది.

వృషభం (ఏప్రిల్ 21- మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. టెలివిజన్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.

మిథునం (మే 21 - జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. న్యాయ, బోధన, సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలు అందకుఉంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచార ం అందుకుంటారు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుక ల నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఆనందంగా గుడుపుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బీమా, మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. అడ్వాన్సులు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. న్యాయ, బోధన, ప్రచురణలు, రవాణా రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల లాభం కలుగుతుంది. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల కోసం ఖర్చుల చేస్తారు. బీమా, హోటల్, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

మకరం (డిసెంబరు 21-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాల ఫలిస్తాయి. విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సంకల్పం నెరవేరుతుంది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆడిటింగ్, క్రీడలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలం. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందకుఉంటారు. ఇల్లు, స్థల సేకరణకు కావలసిన నిధులు సర్దుబాటు అవుతాయి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ