నేటి రాశి ఫలాలు... ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 23 , 2026 | 02:14 AM
నేటి రాశిఫలాలు 23-05-2026, (శనివారం)
నేటి రాశిఫలాలు 23-05-2026, (శనివారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. సన్నిహితులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తుంది. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. దుర్గామాతను ఆరాధించండి.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నెమ్మది అవసరం. శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాలో కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. నవగ్రహాలను ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల సహకారం లోపిస్తుంది. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవచ్చు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నత విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహావిష్ణువు ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. సన్నిహతుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పెద్దల సలహా మేరకు నడుచుకోవడం మేలు. కీలక పదవుల విషయంలో నిరుత్సాహానికి లోనవుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. వేడుకలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ