ఈ రాశి వారికి గుడ్ న్యూస్ అదృష్టం ఒక్కసారిగా మారనుంది
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:27 AM
నేడు రాశిఫలాలు 2-03-2026 సోమవారం, విద్యార్థులు విజయసాధనకు పట్టుదలతో శ్రమించాలి...
నేడు రాశిఫలాలు 2-03-2026 సోమవారం, విద్యార్థులు విజయసాధనకు పట్టుదలతో శ్రమించాలి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులు విజయసాధనకు పట్టుదలతో శ్రమించాలి. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, విద్యా సంస్థల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. దూరప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందుకోవాల్సి రావచ్చు. పరమేశ్వరుని ఆరాధించండి.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పెట్టుబడులను సమీక్షించుకుంటారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, రవాణా, బోధన, కమ్యూనికేషన్ రంగాల వారు నిదానం పాటించాలి. ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఉదయం విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. శివ పంచాక్షరీ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విదేశీ ప్రయాణాలు, పైచదువులకు అవసరమైన నిధులు సకాలంలో అందక కొంత ఇబ్బంది పడతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
మూచ్యువల్ ఫండ్స్, పొదుపు పథకాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పన్నులు, బీమా వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనల అమలు ఈ రోజుకు వాయిదా వేయండి. పరమశివుని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్, సినిమాలు, రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. సమావేశాల్లో ఖర్చులు అధికం. రుద్రకవచ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అధికం. గోసేవ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, విద్య, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారు వృత్తి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో మనస్తాపానికి లోనవుతారు. పరమశివుని ఆరాధిచండి.

ధనుస్సు (నవంబరు 23- డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సమావేశాలు, ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. లలితా పరమేశ్వరీ మాత ఆరాధన మేలు చేస్తుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య కోసం ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.

కుంభం (22-జనవరి 21-ఫిబ్రవరి19 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. శ్రీ శివ అష్టోత్తర శత నామా పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. విందు వినోదాలకు ఖర్చులు అధికం. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి