నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే.....
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:03 AM
నేటి రాశిఫలాలు 20-4-2026 (సోమవారం)
నేటి రాశిఫలాలు 20-4-2026 (సోమవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు ఫలించకపోవచ్చు. నిధుల విషయంలో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రయాణాలు, వాహనాల కోసం ఖర్చులు అధికం. తోబుట్టువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకుని ముందడుగు వేయడం మంచిది. శివ పంచాక్షరీ పారాయణ మేలు చేస్తుంది.

మిథునం (మే 21- జూన్ 21 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో అశాంతికి లోనవుతారు. వైఫల్యాలపై సమీక్షించుకునేందుకు ఇది సరైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రుల గురించి ఆలోచిస్తారు. పరమశివుని ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. ఊరేగింపులు, ప్రదర్శనల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకంటారు. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో పెద్దలు, నిపుణుల సలహా మేరకు నడుచుకోవడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. బృందకార్యక్రమాల్లో పెద్దలను కలుసుకుంటారు. శివ పంచాక్షరీ పారాయణ మంచిది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తిపరమైన చర్చలు, సమావేశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. వేడుకల్లో మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. వేడుకలు, సమావేశాల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పరమేశ్వరుని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు. భాగస్వామి ఆరోగ్యం కలవరపెడుతుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 23 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల కోసం ఖర్చులు అధికం. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాట పెడతారు. శివ పంచాక్షరీ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో ఖర్చులు అధికం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారు లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. పరమ శివుని ఆరాధించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు సకాలంలో చేరక ఇబ్బంది పడతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ