ఈ రాశి వారికి గుడ్ న్యూస్ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:16 AM
నేడు రాశిఫలాలు 19-03-2026 గురువారం, వేడుకలు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు....
నేడు రాశిఫలాలు 19-03-2026 గురువారం, వేడుకలు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాలు, సినిమాలు, టెక్స్‌టైల్స్, కళలు, ఎగుమతులు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. బృందకార్యక్రమల్లో పాల్గొంటారు. సాయినాధుని ఆరాధన. శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
మీ అంచనాలు ఫలిస్తాయి. వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. టెలివిజన్, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటు అవుతాయి. బంధుమిత్రుతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. గోమాతను ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆస్పత్రులు, హోటళ్లు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దత్త కవచపారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనసు ఉల్లాసగా ఉంటుంది. ఆడిటింగ్, ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారికి ప్రోత్సాహకరమైన రోజు. పంచాంగ శ్రవణం శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గోమాత ఆరాధన మేలు చేస్తుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
తోబుట్టవులు, బఽంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తారు. పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. షిర్డిసాయినాధుని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ