Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ శుభవార్తలు వరుసగా వినిపిస్తాయి

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:16 AM

నేడు రాశిఫలాలు 17-03-2026 మంగళవారం, ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు....

ఈ రాశి వారికి గుడ్ న్యూస్ శుభవార్తలు వరుసగా వినిపిస్తాయి

నేడు రాశిఫలాలు 17-03-2026 మంగళవారం, ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి, ఉదయం 9 గంటల తరువాత రాజకీయ, సినీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. ఉదయం 9 గంటల తరువాత ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. పెద్దలతో చర్చలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. ఉదయం 9 గంటల తరువాత ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లోపిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. రుణాల మంజూరు, పెట్టుబడుల విషయంలో పురోగతి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల తరువాత పన్నులు, బీమా వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉదయం 9 గంటల తరువాత పందాలు, పోటీల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఉదయం 9 గంటల తరువాత ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఉదయం 9 గంటల తరువాత చిన్నారుల ఆరోగ్యం కలవరపెడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహపడతారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24- నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉదయం 9 గంటల తరువాత చర్చలు, ప్రయాణాలు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహరంగా ఉంటుంది. డబ్బు విషయంలో సన్నిహితులు సహకారం లభిస్తుంది. బిల్లులు, చెక్కులు అందుకుంటారు. ఉదయం 9 గంటల తరువాత ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

నిధులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉదయం 9 గంటల తరువాత పెట్టుబడుల విషయంతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

విదేశాల్లో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యల పరిష్కారానికి ఒక మార్గ దొరుకుతుంది. మనసు తేలికపడుతుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఉదయం 9 గంటల తరువాత ఎగుమతులు, విదేశీ వాణిజ్యరంగాల వారు నిదానం పాటించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Mar 17 , 2026 | 12:16 AM