Share News

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. (14/05/2026)

ABN , Publish Date - May 14 , 2026 | 01:21 AM

నేటి రాశిఫలాలు 14-5-2026, (గురువారం)

నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. (14/05/2026)

నేటి రాశిఫలాలు 14-5-2026, (గురువారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక సంస్థలతో పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దత్త కవచ పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. గోమాతను ఆరాధించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. దత్త కవచ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. బృందకార్యక్రమాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్త్రోత్ర పారాయణ శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దలను స్మరించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. దానధర్మాలు చేస్తారు. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లోపిస్తుంది. గోసేవ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నిధుల విషయంలో బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. పందాలు, పోటీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దానధర్మాలు, సేవా కార్యక్రమాలు శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు అధికం. సామినాథుని ఆరాధన శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులను కలుసుకుంటారు. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్‌, క్రీడలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. గోసేవ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్పులకు అనుకూలమైన రోజు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్నదానం శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - May 14 , 2026 | 07:10 AM