నేటి రాశి ఫలాలు.. (13/05/2026)
ABN , Publish Date - May 13 , 2026 | 01:18 AM
నేటి రాశిఫలాలు 13-5-2026, (బుధవారం)
నేటి రాశిఫలాలు 13-5-2026, (బుధవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
నిధులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. మహాగణపతి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలకు, విదేశాల్లో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. మనసు తేలికపడుతుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించండి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. పెద్దలతో చర్చలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు. గణపతిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. రుణాల మంజూరు, పెట్టుబడుల విషయంలో పురోగతి కనిపిస్తుంది. పన్నులు, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆలయ దర్శనం శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. మహాగణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24- నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కృషి రంగంలో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహాగణపతిని ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. లక్ష్య సాధనలో సన్నిహితులు సహకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. చర్చలు, ప్రయాణాలు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహరంగా ఉంటుంది. డబ్బు విషయంలో సన్నిహితులు సహకారం లభిస్తుంది. బిల్లులు, చెక్కులు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ