నేటి రాశి ఫలాలు..... ఎలా ఉన్నాయంటే...
ABN , Publish Date - May 02 , 2026 | 01:04 AM
నేటి రాశిఫలాలు 02-05-2026 (శనివారం)
నేటి రాశిఫలాలు 02-05-2026 (శనివారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీల్లో రాణిస్తారు. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చు చేస్తారు. పెన్షన్, మూచ్యువల్ ఫండ్స్ వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గోమాత ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో గెలుపు మీదే అవుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాదన శుభప్రదం.

మిథునం ( మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
విందుల్లో పాల్గొంటారు. హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం. గోమాతను సేవించండి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారి పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు.ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించాలి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకలు, సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం మీదే అవుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆడిటింగ్, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు.. గోసేవ శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులకు అనుకూలం. పెద్దలు, పై అధికారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. శ్రీ విష్ణు సహ స్ర నామ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ