Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, జీవితంలో శుభకాలం ప్రారంభం

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:01 AM

నేడు రాశిఫలాలు31-1-2026 - శనివారం, ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిధులు చేతికి అందుతాయి...

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, జీవితంలో శుభకాలం ప్రారంభం

నేడు రాశిఫలాలు31-1-2026 - శనివారం, ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిధులు చేతికి అందుతాయి...

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిఽధులు చేతికి అందుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఇంటర్య్వూలలో ఆఽశించిన ఫలితాలు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టబడులకు సంబంధించిన చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. విలువైన పత్రాలు, పారితోషికాల విషయంలో నిరుత్సాహం తప్పకపోవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బోనస్‌లు, అదనపు ఆదాయం కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు. బీమా, మెడికల్‌ క్లెయిములు, పెన్షన్‌ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయశన శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి బాధ కలిగించే సమాచారం అందుకుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరించాలి. బందుమిత్రులతో విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. సహకార సంఘాలు, వృత్తిపర మైన సమావేశాల్లో పాల్గొంటారు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కన్సల్టెన్సీలు, క్రీడలు, టెలివిజన్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బందుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించిన సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తపరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. సన్నిహితుల వైఖరిర మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, వీసా వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Updated Date - Jan 31 , 2026 | 03:01 AM