Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, అదృష్టం ఒక్కసారిగా మారనుంది

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:20 AM

నేడు రాశిఫలాలు 5-02-2026 గురువారం, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు..

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, అదృష్టం ఒక్కసారిగా మారనుంది

నేడు రాశిఫలాలు 5-02-2026 గురువారం, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ఫార్మ, హోటల్‌, రిటైల్‌ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. దక్షణామూర్తిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారు పైఅధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లలో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. బదిలీలు, మార్పుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాయినాధుని ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సకాలంలో అందుకపోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలించకపోవచ్చు. దక్షిణామూర్తి సోత్ర పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు, పందాలు, పోటీలకు దూరంగా ఉండటం మేలు. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. గోసేవ శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విందు వినోదాల్లో పరిమితులు పాటించాలి. కొత్త పనుల ప్రారంభం విషయంలో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. లక్ష్మీనరసింహ కవచ పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. పొదుపు పథకాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. ప్రియతములతో ప్రయాణాలకు అనుకూలం. సాయినాధుని ఆరాధించండి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు అనుకూలమైన రోజు కాదు. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం కలవరపెడుతుంది. తోబుట్టువుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో కొత్త ప్రయోగాలకు ఈ రోజు దూరంగా ఉండటం మంచిది. కళలు, రక్షణ, టెలివిజన్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. దత్త కవచ పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికం. సాయినాధుని ఆరాధించండి.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సన్నిహితులకు సంబంధించి ఒక రహస్య సమాచారం తెలుసుకుంటారు. దత్తకవచ పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 05 , 2026 | 12:20 AM