Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆదాయం పెరిగే మార్గాలు తెరుచుకుంటాయి

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:08 AM

నేడు రాశిఫలాలు 26-02-2026 గురువారం, చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. శుభవార్త అందుకుంటారు...

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, ఆదాయం పెరిగే మార్గాలు తెరుచుకుంటాయి

నేడు రాశిఫలాలు 26-02-2026 గురువారం, చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. శుభవార్త అందుకుంటారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. శుభవార్త అందుకుంటారు. టీచింగ్‌, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. షేర్‌మార్కెట్‌ లావాదేవీల్లో లాభాలు గడిస్తారు.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆలోచనలు అమలు చేసి వ్యాపార, ఉద్యోగ రంగాల్లో విజయం సాధిస్తారు. పదిమందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఎగుమతులు, ట్రాన్స్‌పోర్ట్‌, సినిమాలు, రాజకీయరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి శుభవార్త అందుకుటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. వాయిదా పద్ధతులపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు అనుకూలం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, ఉద్యోగంలో ప్రమోషన్‌కు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అమలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. లక్ష్య సాధనలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పూర్తవుతాయి. పెట్టుబడులు, షేర్ల లావాదేవీలపై మంచి రాబడి లభిస్తుంది. బ్యాంకులు, ఫైనాన్స్‌, ఆరోగ్యం రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక అనుకూలమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. తోబుట్టువులు లక్ష్య సాధనలో తోడ్పడతారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుతాయి. క్రీడలు, టీచింగ్‌, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి అనుకూలమై రోజు.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. లక్ష్య సాధనకు కొత్త మార్గాన్ని అనుసరించి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల విషయాలపై శ్రద్ధ చూపుతారు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 26 , 2026 | 02:08 AM