ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కొత్త ఆరంభాలకు అనుకూల సమయం
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:50 AM
నేడు రాశిఫలాలు 19-2-2026 గురువారం, తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు...
నేడు రాశిఫలాలు 19-2-2026 గురువారం, తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎదురయినా పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలు, ఉన్నత చదువులకు ప్రోత్సాహకర సమయం. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. యూనియన్ కార్యకలాపాలు, సహకారం సంస్థలతో పనులకు అనుకూలం. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరించేందుకు అనుకూల సమయం. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కళలు, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, ప్రచురణల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాలు, ప్రదర్శనల్లో పాల్గొంటారు.

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
రుణాలు మంజూరవుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు అనుకూలం. మరమ్మతులు, హార్డ్‌వేర్, ఇన్సూరెన్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
జనసంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులపై మంచి లాభాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందేందుకు అనుకూల సమయం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆలోచనా వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ నిర్ణయాలను సమీక్షించుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, విద్య, రవాణా, కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారంల లభిస్తుంది. విద్యారులు మంచి ఫలితాలు సాధిస్తారు. చర్చలు, సమావేశాలు అనుకూల ఫలితాలనిస్తాయి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. అదనపు ఆదాయం అందుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అన్నిరంగాల్లో విజయం సాధిస్తారు.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కొంత కాలంగా ఉన్న చికాకులు తొలగిపోయి మనసు ఉత్సాహంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు అమలుకు అనుకూలమైన రోజు. సంకల్పం నెరవేరుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ