Share News

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కుటుంబంలో ఆనందకర పరిణామాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:47 AM

నేడు రాశిఫలాలు 16-2-2026 - సోమవారం, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి....

ఈ రాశి వారికి గుడ్ న్యూస్, కుటుంబంలో ఆనందకర పరిణామాలు

నేడు రాశిఫలాలు 16-2-2026 - సోమవారం, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. బృందకార్యక్రమాల్లో అనవసర బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పరమేశ్వరుని ఆరాధించడం శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఉద్యోగ రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపించాలి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. సమావేశాలు, చర్చల్లో నిదానం అవసరం. ఫలిస్తాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పరమ శివుని ఆరాధన శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. రుణబాధలు ఇబ్బది పెడతాయి. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పుల వస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ద చూపించాలి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. కొత ్త పరిచయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. జనసంబంధాలు విస్తరిస్తాయి. గోమాత ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సహోద్యోగుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పట్లుదలతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. శ్ర మకు తగిన ఫలితం లభిస్తుంది. పరమేశ్వరుడిని ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పిల్లల వ్యవహారశైలి మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం క లిగిసాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కగిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో శ్రద్ధ చూపించాలి. రుద్ర నమక, చమకాలు వినడం శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు తగిన సమయం కాదు. అన్నదమ్ముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ఒక సమాచారం కలవరపెడుఉతంది. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం ( డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంల నాణ్యత పాటించాలి. ఆర్థిక పరిస్థితి ఆవేదన కలిగిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.


11 KUMBHAM.jpg

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో ఆశాంతి నెలకొంటుంది. వ్యక్తిగత విషయాల్లో అసౌకర్యానికి లోనవుతారు. లక్ష్య సాధనకు మరింత శ్రద్ధతో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనలు అమలుకు సమయం కాదు. శ్రీ రుద్ర కవచ కవచ పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురుకావడంతో ఆశాంతికి లోనవుతారు. ఆత్మపరిశీలనకు తగిన సమయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శాంతినిస్తాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Feb 16 , 2026 | 02:47 AM