నేటి రాశి ఫలాలు... 9-08-2026
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:33 AM
నేటి రాశిఫలాలు 9-08-2026 (ఆదివారం)
నేటి రాశిఫలాలు 9-08-2026 (ఆదివారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు అనుకూలమైన రోజు. కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రియతమల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఉదయం 11 తరువాత మార్కెటింగ్, రవాణా, ఏజెన్సీలు, కమ్యూనికేషన్ వ్యాపారులు నిదానం పాటించాలి.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉదయం 11 తరువాత పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయాలి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
విలువైన సమాచారం లేదా పత్రాలు అందుకుంటారు. వ్యాపారస్తులు, రెప్రజెంటేటివ్‌లు, స్టేషనరీ డీలర్లు మంచి లాభాలు ఆర్జిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో మంచి ఫలితాల సాధిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నం నుంచి తోబుట్టువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. మధ్యాహ్నం నుంచి సినిమాలు, రాజకీయాలు, ఎగుమతులు, బోధన, కళలు, ఫొటోగ్రఫీ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడుల, పొదుపు పథకాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. బంధుమిత్రుల ప్రవర్తన ఆనందం కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి యూనియన్ కార్యకలాపాలు, కంపెనీ వ్యవహారాల్లో నిదానం పాటించాలి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రాజకీయ ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మర్యాదలు పెంపొందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు తొలగిపోయి ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. మధ్యాహ్నం నుంచి లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రవాణా, బోధన, న్యాయ, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ఆనుకూలమైన రోజు. మధ్యాహ్నం నుంచి వేడుకల కోసం ఖర్చులు అధికం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. మ్యూచ్యువల్ ఫండ్స్, పెట్టుబడుల విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నం నుంచి పెద్దలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపెడుతుంది.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ప్రోత్సాహకరంగా జరుగుతాయి. శుభకార్యాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బాంధవ్యాలు, పరిచయాలు విస్తరిస్తాయి. మధ్యాహ్నం నుంచి కొత్తపరిచయాల వల్ల చిక్కులు ఎదురవుతాయి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్, క్యాటరింగ్, ఫార్మసీ వ్యాపారులు అదనపు లాభాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రేమానుబంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి క్రీడలు, ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు. మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి హార్డ్‌వేర్, గృహాలంకరణ, రిటైల్ వ్యాపారులు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ