నేటి రాశి ఫలాలు...... ఎలా ఉన్నాయంటే......
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:26 AM
నేటి రాశిఫలాలు 7-07-2026 (మంగళవారం)
నేటి రాశిఫలాలు 7-07-2026 (మంగళవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థలమార్పునకు అనుకూలం. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి కొత్త ఆలోచనల అమలు వాయిదా వేసుకోవడం మేలు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21- మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణాలు, చర్చలకు అనుకూలం కాదు. సుబ్రహ్మణ్య అష్టకపారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన సమావేశాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత కొత్త పరిచయాల వల్ల చిక్కులు ఎదరవుతాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. మధ్యాహ్నం తరువాత తల్లిదండ్రుల ఆరోగ్యం కలవరపెడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. మధ్యాహ్నం తరువాత ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్య సాధనలో ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మధ్యాహ్నం తరువాత గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వృత్తిపరమైన సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, పరిశ్రమలు, ఫార్యా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తరువాత లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఆంజనేయ స్వామిని దర్శించండి.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. మధ్యాహ్నం తరువాత విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణ విషయాలు భాగస్వామితో చర్చిస్తారు. మధ్యాహ్నం తరువాత రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. తోబుట్టువుల ఆరోగ్యం వెరుగుపడుతుంది. మధ్యాహ్నం నుంచి విందు వినోదాల కోసం ఖర్చులు అధికం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడలు, ఆడిటింగ్, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ఖర్చులు అఽధికం. శ్రీ సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ