Share News

నేటి రాశి ఫలాలు... 5-08-2026

ABN , Publish Date - Aug 05 , 2026 | 02:14 AM

నేటి రాశిఫలాలు 5-08-2026 (బుధవారం)

నేటి రాశి ఫలాలు... 5-08-2026

నేటి రాశిఫలాలు 5-08-2026 (బుధవారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడలు, ఆడిటింగ్‌, విద్యారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21- మే 20 మధ్య జన్మించిన వారు)

ఇల్లు, స్థలమార్పునకు అనుకూలం. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆలోచనల విజయవంతంగా అమలు చేస్తారు. గణపతి ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూల సమయం. సంకలపం నెరవేరుతుంది.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన సమావేశాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల లక్ష్యాలు సాధిస్తారు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. గౌరవ, మన్ననలు అందుకుంటారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వృత్తిపరమైన సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, పరిశ్రమలు, ఫార్యా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇల్లు, స్థల సేకరణ విషయాలు భాగస్వామితో చర్చిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. తోబుట్టువుల ఆరోగ్యం వెరుగుపడుతుంది. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 05 , 2026 | 04:58 AM