Share News

నేటి రాశి ఫలాలు... 31-07-2026

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:46 AM

నేటి రాశిఫలాలు 31-07-2026 (శుక్రవారం)

నేటి రాశి ఫలాలు...  31-07-2026

నేటి రాశిఫలాలు 31-07-2026 (శుక్రవారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతములతో బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు. స్నేహానుబంధాలు విస్తరిస్తాయ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సహకార సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు పెద్దల సహకారంతో ఫలిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు అధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి వాట్సాప్‌ సందేశాలు, ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వాహనం కొనుగోలుకు అనుకూలమైన రోజు. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, ఫార్మసీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. సకాలంలో డబ్బు చేతికి అందుకుంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త భాగస్వామ్యాల గురించి ఆలోచిస్తారు. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. దుర్గామాతను ఆరాధించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

విందు, వినోదాలు ఆనందం కలిగిస్తాయి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం కోసం యోగధ్యానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. క్రీడలు, ఆడిటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, విద్యా సంస్థల వారికి ఆర్థికంగా పోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. గృహనిర్మాణ సామగ్రి, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

కమ్యూనికేషన్లు, స్టేషనరీ, ఏజెన్సీలు, రవాణా వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు అనందం కలిగిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. సన్నిహితులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వారసత్వ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్య సేవలకు అవసరమైన నిథులు సర్దుబాటు అవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కొత్త వారిని కలుపుకుని వినూత్న ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలమైన రోజు. భాగస్వామికి సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయాలు, టెలివిజన్‌, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న సహోద్యోగుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాలు ఉత్సాహం కలిగిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 31 , 2026 | 12:50 AM