నేటి రాశి ఫలాలు... 30-07-2026
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:47 AM
నేటి రాశిఫలాలు 30-07-2026 (గురువారం)
నేటి రాశిఫలాలు 30-07-2026 (గురువారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దత్త కవచ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు అనుకూలం. పై అధికారులు, పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తి అవుతాయి. దక్షిణా మూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21 - జూన్ 21 మధ్య జన్మించిన వారు)
దూర ప్రయాణాలు, అందుకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు, విద్యార్థులు ప్రణాళికాబద్జంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒక శుభవార్త అందుకుంటారు. సాయినాధుని ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
జన సంబంధాలు విస్తరిస్తాయి. పండాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. దూరప్రాంతంలో ఉద్యోగం కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. దక్షిణామూర్తిని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారితో పరిచయాలు లాభిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. దత్త కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. వారి సూచనలు లాభిస్తాయి. ఇల్లు, స్థిరాస్తి విషయాల్లో ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పైఅధికారుల వైఖరిలో మార్పు గమనిస్తారు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులకు సంబంధించిన ఒక శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలమైన రోజు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, బీమా చెల్లింపులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. విరాళాలు, సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. లక్ష్మీనృసింహ స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాలకు సంబంధించి దూర ప్రయాణాలకు అనుకూలం. టెక్స్‌టైల్స్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ, ప్రచురణ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ