నేటి రాశి ఫలాలు... 21-08-2026
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:02 AM
నేటి రాశిఫలాలు 21-8-2026 (శుక్రవారం)
నేటి రాశిఫలాలు 21-8-2026 (శుక్రవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సృజనాత్మక రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, టెలివిజన్, అడ్వర్టయిజ్‌మెంట్, బోధన రంగాల వారి సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటికి అవసరమూన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి చేస్తారు.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. హోటల్, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సృజనాత్మకంగా ఆలోచించి లక్ష్యాలు సాధిస్తారు. ఆడిటింగ్, ప్రకటనలు, క్రీడలు, బోధన, టెలివిజన్ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉంటే బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహారంభ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. స్థిర, చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ముద్రణ, బోధన, రవాణా, రక్షణ, న్యాయ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పన్నులు, బీమా లావాదేవీలు పూర్తి చేస్తారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. సంకల్పం నెరవేరుతుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ