Share News

నేటి రాశి ఫలాలు... 20-08-2026

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:13 AM

నేటి రాశిఫలాలు 20-8-2026 (గురువారం)

నేటి రాశి ఫలాలు... 20-08-2026

నేటి రాశిఫలాలు 20-8-2026 (గురువారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాయి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. సన్నిహితులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తుంది. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నెమ్మది అవసరం. ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. శ్రీ దక్షి ణామూర్తిని ఆరాధించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సాయి చాలీసా పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల సహకారం లోపిస్తుంది. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. గోమాత ను ఆరాధించండి.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవచ్చు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నత విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. సన్నిహతుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దత్త కవచ పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పెద్దల సలహా మేరకు నడుచుకోవడం మేలు. కీలక పదవుల విషయంలో నిరుత్సాహానికి లోనవుతారు. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురవుతాయి. న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. వేడుకలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 20 , 2026 | 01:13 AM