Share News

నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:15 AM

నేటి రాశిఫలాలు 17-06-2026, (బుధవారం)

నేటి రాశి ఫలాలు..  ఎలా ఉన్నాయంటే..

నేటి రాశిఫలాలు 17-06-2026, (బుధవారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఇల్లు, స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఇంటికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బిల్లులు, చెక్కులు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్యా సంస్థల్లో చేరేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. టీచర్లు, రవాణా, ఏజెన్సీలు, రిప్రజెంటేటివ్‌లకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ప్రదర్శనలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పబ్లికేషన్‌లు, టెక్స్‌టైల్స్‌, ఫొటోగ్రఫీ, ఎగుమతులు, కళా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24-అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కీలక సమాచారం అందుకుంటారు. పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులు, పెద్దల సహకారం లభిస్తుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఒక నిర్ణయానికి వస్తాయి. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగస్వామి సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు, కొత్త భాగస్వామ్యాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లాభిస్తాయి. సహోద్యోగులతో విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వైద్యం, ఫార్మసీ, హోటల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 17 , 2026 | 01:10 AM