నేటి రాశి ఫలాలు... 13-08-2026
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:15 AM
నేటి రాశిఫలాలు 13-8-2026 (గురువారం)
నేటి రాశిఫలాలు 13-8-2026 (గురువారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పిల్లలు, ప్రియతముల విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. తోబుట్టవుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణ ప్రయత్నాల ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సాయినాధుని ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
కొంతకాలంగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి ఉల్లాసం నెలకొంటుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మపరిశీలనకు తగిన సమయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శాంతినిస్తాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బృందకార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రదర్శనలు, యూనియన్ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పదిమందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. దత్త కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 -డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, పెన్షన్, పన్నులు, రుణాలకు సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వారసత్వ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో విజయం మీ సొంతం అవుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సమావేశాలు, వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. గోమాత ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి,. పట్లుదలతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యవసాయం, పరిశ్రమలు, ఔషధాలు, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ