నేటి రాశి ఫలాలు... 11-08-2026
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:27 AM
నేటి రాశిఫలాలు 11-8-2026 (మంగళవారం)
నేటి రాశిఫలాలు 11-8-2026 (మంగళవారం)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతములు, చిన్నారుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ఇంటి కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

వృషభం (ఏప్రిల్ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా విషయంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. తోబుట్టవులతో చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు, లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్కులు, విలువైన పత్రాలపై సంతకాల విషయంలో నిదానం అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లను వాయిదా వేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు కాదు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించండి.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, సినిమాలు, రాజకీయ రంగాల వారు కీలక నిర్ణయాలను ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. మనశ్శాంతి లోపిస్తుంది. యోగధ్యానాలు, ఆధ్యాతిక, సేవా కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు, సమావేశాలకు ఆటంకాలు ఎదురుతాయి. బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. వేడుకల్లో మాటపడాల్సి వస్తుంది. అపనిందలు ఎదురువుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లోపించడంతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. సమావేశాలు, చర్చల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. పన్నులు, బీమా వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపించడంతో లక్ష్యాలు సాధించడంలో ఇబ్బంది పడతారు. విందు వినోదాలు, సమావేశాలకు ఖర్చులు అధికం. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్ రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోడంతో మనస్తాపం కలుగుతుంది. బోధన, క్రీడలు, ప్రకటనలు, ఆడిటింగ్ రంగాల వారు నిదానం పాటించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ