Share News

నేటి రాశి ఫలాలు.... ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:53 AM

నేటి రాశిఫలాలు 1-07-2026 (బుధవారం)

నేటి రాశి ఫలాలు....  ఎలా ఉన్నాయంటే..

నేటి రాశిఫలాలు 1-07-2026 (బుధవారం)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలమైన రోజు. మార్కెటింగ్‌, రవాణా, టీచింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పాతబకాయిలు వసూలవుతాయి. అదనపు ఆదాయం అందుకుంటారు. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవ హారాలు ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో గెలుపు మీదే అవుతుంది.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఆస్పత్రులు, వైద్య సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల్లో ప్రియతములను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. తోబుట్టువుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. పన్నులు, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయపోరాటాల్లో పైచేయి సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. దూరంలో ఉన్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. యోగ, ధ్యానాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సమావేశాలు, వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 01 , 2026 | 01:53 AM