Share News

నేటి రాశి ఫలాలు... 9-09-2026

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:57 AM

నేటి రాశి ఫలాలు.. బుధవారం 9-09-2026

నేటి రాశి ఫలాలు... 9-09-2026

నేటి రాశి ఫలాలు.. బుధవారం 9-09-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బోధన, క్రీడలు, ప్రకటనలు, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. మధ్యాహ్నం నుంచి చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవడంతో మనస్తాపం కలుగుతుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి ప్రియతములు, చిన్నారుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ఇంటి కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. విషుమూర్తిని ఆరాధించండి.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులుతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. మధ్యాహ్నం నుంచి ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా విషయంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు, లావాదేవీలకు అనుకూలం. మధ్యాహ్నం నుంచి చెక్కులు, విలువైన పత్రాలపై సంతకాల విషయంలో నిదానం అవసరం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లను వాయిదా వేసుకోవడం మంచిది. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మధ్యాహ్నం నుంచి పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ రామచంద్ర మూర్తిని దర్శించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

టెలివిజన్‌, సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మనశ్శాంతి లోపిస్తుంది. గతంలో చేసిన పొరపాట్లకు ఫలితం అనుభవించాల్సి రావచ్చు. మహాగణపతి ఆరాధన శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు, సమావేశాలకు అనుకూలం. మధ్యాహ్నం నుంచి బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. వేడుకల్లో మాటపడాల్సి వస్తుంది. అపనిందలు ఎదురవుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. మహా గణపతిని ఆరాధించండి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి సమావేశాలు, చర్చల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం నుంచి ప్రయాణాలు, సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. పన్నులు, బీమా వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మహా గణపతిని ఆరాధించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. గోపాల కృష్ణ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాలు, సమావేశాలకు ఖర్చులు అధికం. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌ రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపండి. లక్ష్మీ గణపతిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 09 , 2026 | 01:44 AM