Share News

నేటి రాశి ఫలాలు.. 8-11-2026

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:14 AM

నేటి రాశి ఫలాలు.. ఆదివారం 8-11-2026

నేటి రాశి ఫలాలు.. 8-11-2026

నేటి రాశి ఫలాలు.. ఆదివారం 6-11-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. దుర్గా మాత ఆలయ దర్శనం శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకలు, సమావేశాల కోసం ఖర్చులు అధికం అవుతాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. లక్ష్మీదేవిని ఆరాధించండి.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వ్యాపార లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. వేడుకలు, విందు వినోదాలు, సమావేశాల్లో ఖర్చులు అధికం. సహోద్యోగులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపండి. లక్ష్మీ దేవిని ఆరాధించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోధన, క్రీడలు, ప్రకటనలు, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతమలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ లలితా పరమేశ్వరిని ఆరాధించండి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 2 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది.. ప్రియతములు, చిన్నారుల వైఖరిలో మార్పు ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటి కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మహాలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. తోబుట్టువులుతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీదేవిని దర్శించండి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లక్ష్య సాధనకు ఆ పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థికపరమైన చర్చలు, సమావేశాలకు అనుకూలం. సమావేశాలు, బృందకార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. వేడుకల్లో మాటపడాల్సి వస్తుంది. అపనిందలు ఎదురవుతాయి. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. మహా లక్ష్మీ దేవిని ఆరాధించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాలు, చర్చల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. తోబుట్టువులుతో చర్చల విషయంలో నిదానం పాటించండి. శుభవార్త అందుకుంటారు. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, సమావేశాల్లో అసౌకర్యం కలుగుతుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మహాలక్ష్మీ దేవిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Nov 08 , 2026 | 01:53 AM